Fri Dec 05 2025 12:40:45 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : మరో క్రేజీ అప్ డేట్.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందిగా?
నందమూరి బాలకృష్ణతో కలసి తాను కూడా నటించనున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా క్రేజ్ కనపడుతుంది. సిల్వర్ స్క్రీన్ పై తమ అభిమాన హీరోలు ఇద్దరు కనిపించడంతో ఇద్దరి ఫ్యాన్స్ కు కూడా పండగే. గతంలో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలు వచ్చి బాక్సాఫీసు వద్ద రికార్డులను బ్రేక్ చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ కనపడుతుంది. ముఖ్యంగా నాటి తరం హీరోలు.. అరవై పదులు దాటిన మన కథానాయకులు ఇద్దరు కలసి స్క్రీన్ పై కనిపిస్తే అంతకు మించిన ఆనందం మరేముంటుంది. అందుకే దర్శకులు కూడా వారికి తగినట్లుగా కథలు రాస్తున్నారు.
మల్టీస్టారర్ మూవీలు...
మెగాస్టార్ చిరంజీవి తో పాటు హీరో రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ కావడంతో మరొకసారి క్రేజీ కాంబినేషన్ లలో తీసుకు వచ్చేందుకు దర్శకులు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక మూవీలో చిరంజీవితో పాటు హీరో వెంకటేశ్ కూడా కనిపించే అవకాశముంది. ముఖ్యమైన పాత్రలో చిరంజీవితో పాటు స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు. ఇద్దరు సూపర్ హీరోలు కథతో తెరకెక్కుతున్న ఈ మూవీ సంగతి పక్కన పెడితే తాజాగా మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణతో కలసి తాను కూడా నటించనున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
అమెరికాలో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకల్లో ఈ విషయాన్ని వెంకటేశ్ వెల్లడించారు. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో కలసి తాను కెమెరాముందుకు రానున్నట్లు వెంకటేశ్ చెప్పడంతో దగ్గుబాటి, నందమూరి క్రేజీ కాంబినేషన్ లో ఒక చిత్రం రెడీ అవుతుందని తెలిసి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ అఖండ 2 సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించనున్నారు. అందులో వెంకటేశ్ కూడా నటించే అవకాశాలున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా బాక్సాఫీసు ను షేక్ చేస్తుందన్నది టాలీవుడ్ వర్గాల టాక్.
Next Story

