Wed Dec 17 2025 14:14:19 GMT+0000 (Coordinated Universal Time)
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్ర లోకేష్
పవిత్ర లోకేష్‌తో టాలీవుడ్ నటుడు నరేష్ రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీనియర్ నటి పవిత్ర లోకేష్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టారు.
పవిత్ర లోకేష్ మైసూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తన పేరు మీద చాలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయ్యాయని, ఆ ఖాతాల్లో పరువు నష్టం కలిగించే పోస్టులు వచ్చాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తులు తనపై వదంతులు, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని లోకేశ్ చెప్పుకొచ్చారు. కన్నడ సీనియర్ నటుడు దివంగత మైసూరు లోకేష్ కుమార్తె పవిత్రా లోకేష్ సీరియల్స్ తో పాటూ, పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్, సోదరుడు ఆది లోకేష్ కన్నడ చిత్ర పరిశ్రమలో నటులుగా స్థిరపడ్డారు. ప్రస్తుతం పవిత్ర లోకేష్‌తో టాలీవుడ్ నటుడు నరేష్ రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నరేష్ ఇప్పటికే 3 సార్లు పెళ్లి చేసుకుని మూడు సార్లు విడాకులు తీసుకున్నాడు. పవిత్ర లోకేష్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. పవిత్ర లోకేష్, నరేష్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఇటీవల పుకార్లు వచ్చాయి.
News Summary - Veteran actress Pavitra Lokesh lodges complaint with Mysuru Cyber police over fake accounts
Next Story

