Sun Dec 08 2024 00:59:32 GMT+0000 (Coordinated Universal Time)
అఖండ మాదిరిగానే వీరసింహారెడ్డి రన్నింగ్ టైమ్.. వర్కవుటయ్యేనా ?
గతేడాది డిసెంబర్ లో విడుదలై సంక్రాంతి వరకూ థియేటర్లలో ఆడి.. భారీ కలెక్షన్లు వసూలు చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా వీరసింహారెడ్డి. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్లో కనిపిస్తుండటంతో 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సంక్రాంతి బరిలోకి జనవరి 12న దిగుతున్న వీరసింహారెడ్డి.. రన్ టైమ్ ను లాక్ చేసిందట చిత్రబందం.
ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 43 నిమిషాలు ఉంది. అంటే ఇంచుమించు అఖండ సినిమా మాదిరిగానే. అఖండ రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలు ఉండగా.. గతేడాది డిసెంబర్ లో విడుదలై సంక్రాంతి వరకూ థియేటర్లలో ఆడి.. భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అఖండ లో ఫస్టాఫ్ కంటే సెకండాఫ్, క్లైమాక్స్ లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ హిటయ్యేలా చేశాయి. మరి వీరసింహారెడ్డిలో బాలయ్య ఎలివేషన్ ఎలా ఉండబోతుంది ? ఇంత రన్ టైమ్ సినిమాకు వర్కవుటవుతుందా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. మరి ఆమె కాకుండా మరో హీరోయిన్ ఉందా? అన్న విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంతవరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story