Tue Dec 16 2025 00:51:45 GMT+0000 (Coordinated Universal Time)
మెగా వెడ్డింగ్ వీడియోలు.. పవన్ ఫోటోలు చూశారా..
వరుణ్, లావణ్య పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ ఫోటోలు కూడా..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ ఇద్దరు ఈ ఏడాది జులైలో ఎంగేజ్మెంట్ తో అందరికి తెలియజేశారు. ఇక ఏడడుగులు వేయడానికి కుటుంబాలను తీసుకోని ఇటలీ వెళ్లిన ఈ కొత్త జంట.. అక్కడ హిందూ సాంప్రదాయ పద్దతిలో ఒకటయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇంకా నెట్టింట కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు, వీడియోల్లో.. పెళ్లి మండపం, వరుణ్ తేజ్ కారులో మండపానికి రావడం, పెళ్లి భోజనాలు ఏర్పాటలకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫోటో కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పవన్ ఫోటోలు కూడా వచ్చాయి. అయితే వాటిలో పేస్ కనిపించడం లేదు. కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. లగే చిరంజీవి, సాయి ధరమ్, అల్లు అర్జున్ కూడా ఆ ఫొటోల్లో కనిపిస్తున్నారు. మరి ఆ ఫోటోలు, వీడియోలు వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Next Story

