Fri Dec 05 2025 20:05:54 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి తరువాత బన్నీ, చరణ్ల్లో.. మార్పు వచ్చిందా.. వరుణ తేజ్ కామెంట్స్..
రామ్ చరణ్, అల్లు అర్జున్ల్లో పెళ్లి తరువాత మీకు ఎవరిలో ఎక్కువ మార్పు కనిపించింది..? అని ప్రశ్నించగా, వరుణ్ బదులిస్తూ..

మెగా హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్‌ల (Ram Charan) ఒక ఇంటివారు అయ్యిపోయి ఫాదర్స్ గా కూడా ప్రమోషన్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) వంతు వచ్చింది. ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇంతలో తన కొత్త మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) రిలీజ్ రావడంతో.. ముందు దాని పనులు పూర్తి చేసి తరువాత పెళ్లి పనులు మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వరుణ్ తేజ్ కి ఇటీవల ఒక క్రేజీ క్యూస్షన్ ఎదురైంది. ''రామ్ చరణ్, అల్లు అర్జున్ల్లో పెళ్లి తరువాత మీకు ఎవరిలో ఎక్కువ మార్పు కనిపించింది..?'' అని ప్రశ్నించగా, వరుణ్ బదులిస్తూ.. "మ్యారేజ్ తరువాత ఎవరిలో అయినా మార్పు రావాలి, వస్తుంది. F2 మూవీలో మేము అదేగా నేర్చుకున్నాము. ఎక్కడ, ఎన్ని చేసిన భార్య దగ్గరకి వచ్చిన తరువాత అంతేగా అంతేగా అంటూ తల ఆడించాల్సిందే" అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు.
ఇక గాండీవధారి అర్జున విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని సుమారు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 80 శాతం షూటింగ్ ఫారిన్ కంట్రీస్‌లోనే జరిపారు. పర్యావరణ పరిరక్షణ అంశం పై ఈ సినిమా కథ ఉండబోతుంది. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ వరుణ్ కి ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి.
Next Story

