Wed Mar 18 2026 23:04:42 GMT+0530 (India Standard Time)
భయంకరమైన స్టోరీతో సినిమా తీస్తున్న వర్మ

వివాదాల దర్శకులు రాంగోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించాడు. ఆఫీసర్ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఆయన భవిష్యత్ ఇక ప్రశ్నార్థకమే అనుకున్నారు అంతా. అతనితో సినిమాలు చేయడానికి ఇంకా ఎవరూ ముందుకు రారు అనుకుంటుండగానే, తన తర్వాత సినిమా పేరు వైరస్ అని కూడా ప్రకటించాడు. తన ది అటాక్స్ ఆఫ్ 26/11, సర్కార్ చిత్రాలు నిర్మించిన పరాగ్ సంఘ్వీనే ఈ సినిమా కూడా నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ‘‘సెంట్రల్ ఆఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఓ విద్యార్థి ద్వారా అరుదైన వైరస్ ముంబైలో భారీ ప్రాణనష్టం చేస్తోంది. వైరస్ మిగతా రాష్ట్రాలకు చేరకుండా ముంబైకి దేశం నుంచి కట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రేమ, బాధ, నిస్సాహాయత వంటి వాటిని ఈ చిత్రంలో తెరకెక్కించనున్నాం’’ అని చిత్రం గురించి రాంగోపాల్ వర్మ తెలిపారు.
Next Story

