Fri Feb 14 2025 12:07:10 GMT+0000 (Coordinated Universal Time)
భక్త కన్నప్పలో ప్రభాస్ లుక్ అదిరిపోయిందిగా
భక్త కన్నప్ప మూవీ తాజా అప్ డేట్ కేవలం మంచు వారి అభిమానులనే కాదు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా అలరించింది

మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ కేవలం మంచు వారి అభిమానులనే కాదు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా అలరించింది. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపిస్తున్నారు. మూవీలో రుద్ర పాత్ర ఎంత సేపు ఉంటుంది అన్నది తెలియకపోయినా ప్రస్తుతం ఈ లుక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
ఫస్ట్ లుక్ రివీల్ కావడంతో...
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సూపర్ హిట్ అయిన నాటి రోజుల్లో నేడు అదే పేరుతో విడుదలవుతున్న చిత్రంపై ఎన్నో ఆశలను మంచుకుటుంబం పెట్టుకుంది. ఇప్పటికే ప్రమోషన్లను స్టార్ట్ చేసిన భక్తకన్నప్ప టీం ప్రభాస్ లుక్స్ ను రివీల్ చేయడంతో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా కనిపించబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.
Next Story