Fri Dec 05 2025 15:28:32 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : అన్ స్టాపబుల్ పవర్ ప్రోమో.. పవన్ తో పాటు మరో మెగా హీరో
ప్రభాస్ ఎపిసోడ్ మాదిరిగానే.. మళ్లీ రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు బాలయ్య. అంతకు ముందు సినిమాల గురించి..

పవన్ కల్యాణ్ అభిమానులు, బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Unstoppable 2 పవన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తోన్న ఈ షో భారీ విజయం అందుకుంది. పవన్ ఎపిసోడ్.. ఇప్పటి వరకూ ఉన్న ఎపిసోడ్లకే బాప్ గా నిలవబోతోందని ఆహానే చెప్పేసింది. లాస్ట్ ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా రాగా.. ఈసారి పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చారు. ఆయనతో పాటు..త్రివిక్రమ్ వస్తారని అంతా భావించారు కానీ.. పవన్ కల్యాణ్ కి స్వయానా అల్లుడైన సాయిధరమ్ తేజ్ గెస్టుగా రావడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన అల్లరి మామూలుగా లేదు. మధ్యలో ప్రభాస్ ఎపిసోడ్ మాదిరిగానే.. మళ్లీ రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు బాలయ్య. అంతకు ముందు సినిమాల గురించి మాట్లాడుతూ.. గుడుంబా శంకర్ లో ప్యాంట్ మీద ప్యాంట్ వేసిన విషయాలను గురించి మాట్లాడారు. బాలకృష్ణ - పవన్ కల్యాణ్ మొదటిసారి కలిసిన ఫోటోని ఆడియన్స్ కి చూపించారు. అలా సినిమాల గురించి, కుటుంబం, రాజకీయాల గురించి ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు బాలయ్య. ఆఖరిలో నా నా విజ్ఞత, సంస్కారం నన్ను మాటాడనివ్వకుండా చేస్తుందని పవన్ అన్న మాటలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.
Next Story

