Thu Dec 05 2024 17:14:50 GMT+0000 (Coordinated Universal Time)
నటి తునీషా శర్మ మృతి.. అతడిని అరెస్టు చేసిన పోలీసులు
టెలివిజన్ నటి తునీషా శర్మ శనివారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో సీరియల్ సెట్లో శవమై కనిపించినట్లు పోలీసు అధికారి తెలిపారు. విరామ సమయంలో సెట్లోని బాత్రూమ్కి వెళ్లిన తునీషా ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఆమె శవమై కనిపించింది. ఆమె మరణం తరువాత ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ను వాలివ్ పోలీసు అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తునీషా తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తునీషా మరణవార్త కారణంగా బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తునీషా చేసిన చివరి పోస్టును షేర్ చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. 'భారత్ కా వీర్ పుత్ర' సీరియల్తో 13 ఏళ్లకే నటిగా మారిన తునీషా.. ఆ తర్వాత 'చక్రవర్తి అశోక సామ్రాట్', 'గబ్బర్ పూన్చావాలా', 'ఇంటర్నెట్ వాలా లవ్', 'హీరో: గాయబ్ మోడ్ ఆన్' వంటి సీరియళ్లలో నటించారు. ఆ తర్వాత 'ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించారు. అలాగే, 'బార్ బార్ దేఖో', 'కహానీ 2', 'దబాంగ్ 3' సినిమాల్లోనూ నటించింది.
Next Story