Thu Mar 19 2026 10:45:53 GMT+0530 (India Standard Time)
Mallika Rajput : ప్రముఖ నటి, సింగర్ బలవన్మరణం
ఉత్తర్ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడింది

Mallika Rajput :ఉత్తర్ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడింది. మూడు పదుల వయసులోనే ఆమె బలవన్మరణానికి పాల్పడటం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. తన ఇంట్లోనే మల్లికా రాజ్పుత్ మరణించి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సీతాకుండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
ఇంట్లో ఉరేసుకుని...
కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా తన గదిలో ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆమె మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. గాయనిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ నటిగా కూడా అరంగేట్రం చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినీ ప్రముఖులు మల్లికా రాజ్పుత్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

