Sun Mar 08 2026 04:25:09 GMT+0530 (India Standard Time)
RRR సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. RRR సినిమా చూస్తూ ఒక అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. RRR సినిమా చూస్తూ ఒక అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలయింది. అయితే అనంతపురం లోని ఒక సినిమా థియేటర్ లో బెనిఫిట్ చూస్తూ ఓబులేసు అనే అభిమాని ప్రాణాలు విడిచాడు. ఎగ్జైట్మెంట్ కు గురై గుండెపోటుతు ఓబులేసు మరణించాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు.
ఆసుపత్రికి తరలించే లోపు....
గుండెపోటుతో మృతి చెందిన ఓబులేసుకు గతంలోనే హార్ట్ కు స్టంట్ వేశారు. గుండెపోటు రాగానే సమీపంలోని స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోగానే ఓబులేసు మరణించాడు. ఈ ఘటనతో రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులలో విషాదం నెలకొంది.
Next Story

