Mon Mar 16 2026 07:51:40 GMT+0530 (India Standard Time)
శోకసంద్రంలో టాలివుడ్
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి చెందారు.

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి చెందారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గౌతంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. తెలుగు, హింది, తమిళం, కన్నడ భాషల్లో గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. దాదాపు 800 సినిమాలకు ఆయన ఎడిటర్ గా వ్యవహరించారు.
ఎన్నో చిత్రాలకు....
ప్రముఖ చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. చట్టానికి కళ్లులేవు సినిమాతో గౌతమ్ రాజు సినిమా ఎడిటర్ గా బాధ్యతలను చేపట్టి ఆ తర్వాత అనేక చిత్రాలకు పనిచేశారు. ఆయన మృతితో టాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. గౌతమ్ రాజు మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Next Story

