Mon Feb 02 2026 03:21:07 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో విషాదం.. దర్శకుడి మృతి
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు.

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలో ఆయన మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 86 సంవత్సరాలు. చంద్ర శేఖర్ రెడ్డి మొత్తం 80 చిత్రాల వరకూ దర్శకత్వం వహించారు.
అనేక చిత్రాలకు....
ఎన్టీఆర్, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ హీరోలుగా చంద్రశేఖర్ రెడ్డి అనేక సినిమాలకు పనిచేశారు. కృష్ణ చిత్రాలకు చంద్రశేఖర్ రెడ్డి ఎక్కువగా దర్శకత్వం వహించారు. చంద్రశేఖర్ రెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

