Mon Mar 16 2026 04:26:51 GMT+0530 (India Standard Time)
ఇళయరాజా ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు పావళర్ శివన్ మృతి చెందారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు పావళర్ శివన్ మృతి చెందారు. శివన్ గుండెపోటుతో మరణించారని వైద్యులు తెలిపారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో శివన్ మంచం మీద నుంచి కింద పడి పోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావళర్ శివన్ మరణించారని వైద్యులు నిర్ధారించారు.
గిటార్ వాయిద్య కళాకారుడిగా...
దీంతో ఇళయరాజా కుటుంబంలో విషాదం నెలకొంది. అరవై ఏళ్లశివన్ గిటార్ వాయిద్య కళాకారుడిగా గుర్తింపు పొందారు. తండ్రి సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన మాత్రం గిటార్ వాయిద్య కళాకారుడిగానే ఉన్నారు. శివన్ మృతి పట్ల తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శివన్ మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఇళయరాజాకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story

