Sat Dec 06 2025 00:47:07 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : 17వరోజుకు చేరిన టాలీవుడ్ సమ్మె
టాలీవుడ్ కార్మికుల సమ్మె పదిహేడో రోజుకు చేరింది. నిన్న ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు చెబుతున్నారు.

టాలీవుడ్ కార్మికుల సమ్మె పదిహేడో రోజుకు చేరింది. నిన్న ఫిలిం ఫెడరేషన్ నాయకులతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు చెబుతున్నారు. కేవలం రెండు విషయాల్లోనే కార్మిక సంఘాల నేతలకు, నిర్మాతలకు మధ్య అంగీకారం కుదరలేదు. దీంతో నేడు కూడా ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరపపనున్నారు.
సానుకూల ఫలితాలు...
నేడు జరిపే చర్చల్లో ఫలితం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. నిర్మాతలు ఒకింత దిగి వచ్చారని, కార్మికులు కూడా కొంత తమ డిమాండ్ల విషయంలో అంగీకారం తెలిపినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈరోజు చర్చలు సఫలమయితే రేపటి నుంచి షూటింగ్ లు జరుగుతాయని నిర్మాతలు చెబుతున్నారు. మరి నేటి చర్చలు ఏ మేరకు జరుగుతాయన్నది చూడాలి.
Next Story

