Fri Dec 05 2025 13:22:02 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya Ram Mandir : అయోధ్యలో సినీ సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి.

Ayodhya Ram Mandir : నేడు జనవరి 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హిందువుల కల నెరవేరుతున్న రోజు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతుంది. ఇక ఈ మహత్తర వేడుకకు హాజరుకావాలంటూ రాజకీయ రంగంతో పాటు సినీ, క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆహ్వానం అందుకున్న అందరూ అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్టని చూసేందుకు తరలి వెళ్లారు.
టాలీవుడ్ నుంచి మెగా కుటుంబసభ్యులు చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కోలీవుడ్ నుంచి రజినీకాంత్, ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కంగనా, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, మధుర్ బండార్కర్, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సచిన్ టెండూల్కర్, చంద్రబాబు నాయుడు.. తదితరులు అయోధ్యకు చేరుకున్నారు. దీంతో అయోధ్య ఎయిర్ పోర్టులో సుమారు 100 ప్రైవేట్ విమానాలు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్న సెలబ్రిటీస్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి పై ఓ లుక్ వేసేయండి.
Next Story

