Fri Oct 04 2024 04:27:48 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది వివాహం చేసుకున్న టాప్ సెలబ్రిటీస్ వీరే..
ఈ ఏడాది వివాహం చేసుకున్న టాప్ సెలబ్రిటీస్ ఎవరెవరు ఒక లుక్ వేసేయండి.
2023 Rewind : ఈ నెలతో 2023 కి గుడ్ బై చెప్పేబోతున్నాము. ఇక ఈ ఇయర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే.. చంద్రయాన్ 3 లాంచ్, వరల్డ్ కప్, ఆస్కార్, సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఇలా చాలా అరుదైన ఈవెంట్సే జరిగాయి. ఇక కొత్త సంవత్సరం కొత్త ప్రయాణం మొదలుపెట్టబోయే ముందు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం మొదలు పెట్టారు అందరూ. ఈక్రమంలోనే ఈ ఏడాది వివాహం చేసుకున్న టాప్ సెలబ్రిటీస్ ఎవరెవరు ఒక లుక్ వేసేయండి.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ కూడా ఈ ఏడాది ఏడడుగులు వేసేశారు. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారసురాలు అయిన 'రక్షితా రెడ్డి'ని శర్వానంద్ జూన్ 3న పెళ్లి చేసుకున్నారు. జైపూర్ లీలా ప్యాలెస్లో ఈ వివాహం గ్రాండ్గా జరిగింది.
మెగా హీరో వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠి దాదాపు ఆరేళ్ళు సీక్రెట్ లవ్ స్టోరీ నడిపి.. ఈ ఏడాది నవంబర్ 1న ఏడడుగులు వేసి పెళ్లి జీవితాన్ని మొదలుపెట్టారు. ఇటలీలో ఈ మెగా వెడ్డింగ్ ఘనంగా జరిగింది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్, లావణ్య కలిసి నటించారు.
మంచు వారసుడు మనోజ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుటుంబంలోని వారసురాలు భూమా మౌనికని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. మార్చి 3న హైదరాబాద్ లో మంచు లక్ష్మీ ఇంటిలో ఈ వివాహం జరిగింది. కాగా మనోజ్ అండ్ మౌనికకి ఇది రెండో వివాహం. గతంలో వీరిద్దరికి విడివిడిగా పెళ్లి అయ్యి విడాకులతో విడిపోయారు.
ఈ ఏడాది బాగా వైరల్ అయిన వివాహం అంటే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి అనే చెప్పాలి. మార్చి 10న ఈ వివాహం జరిగింది. నరేష్ ఇది నాలుగో వివాహం. పవిత్ర లోకేష్ కి ఇది రెండో వివాహం. పవిత్రతో పెళ్లిని ఖండిస్తూ నరేష్ మూడో భార్య కోర్ట్ మెట్లు ఎక్కడంతో పెద్ద రచ్చే అయ్యింది. కాగా ఈ పెళ్లి విషయాన్ని మొత్తాన్ని 'మళ్ళీ పెళ్లి' అనే సినిమాగా చిత్రీకరించి ఆడియన్స్ ముందుకు కూడా తీసుకు వచ్చారు.
దగ్గుబాటి పెళ్ళిసందడి..
దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ కూడా ఈ ఏడాది ఏడడుగులు వేశారు. దగ్గుబాటి బంధువులు అయిన ఫ్యామిలీకి చెందిన 'ప్రత్యూష' అనే అమ్మాయి మేడలోనే అభిరామ్ మూడుముళ్లు వేశారు. డిసెంబరు 6న శ్రీలంకలో ఈ వివాహం జరిగింది.
తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకొని 2014లో విడాకులు తీసుకున్న అమలా పాల్.. ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని నవంబర్ 5న కోచిలో వివాహం చేసుకున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కార్తీక. నాగచైతన్య జోష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక.. ప్రస్తుతం సినిమాలు మానేసి దుబాయిలో బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు. నవంబర్ 19న రోహిత్ మీనన్ అనే వ్యక్తిని కేరళలోని త్రివేండ్రంలో వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు వారసురాలు, హీరోయిన్ అతియాశెట్టి.. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తో లవ్ స్టోరీ నడిపిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఈ ఏడాది మొదటిలో జనవరి 23న పెళ్లి చేసుకున్నారు. ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్హౌస్ జహాన్ లో ఈ వివాహం జరిగింది.
ఇక ఫిబ్రవరి నెలలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. షేర్షా సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడ్డ వీరిద్దరి.. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని కోటలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. సెప్టెంబర్ 24న మూడుముళ్లు వేయించుకున్నారు. రాజస్థాన్ కోటలోనే వీరి వివాహం కూడా వైభవంగా జరిగింది.
News Summary - Tollywood to Bollywood celebrities are married in 2023
Next Story