Wed Mar 18 2026 09:34:25 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూత
గుండెపోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దర్శకుడు, నటుడైన దాసరి నారాయణరావుకు ..

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (66) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దర్శకుడు, నటుడైన దాసరి నారాయణరావుకు బోసుబాబు వరుసకు బామ్మర్ది అవుతారు. బోసుబాబు తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆశీస్సులతోనే నిర్మాతగా మారి.. అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' సినిమాలను నిర్మించారు. కొడాలి బోసుబాబు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన భార్య, నలుగురు పిల్లలున్నారు.
Next Story

