Mon Mar 16 2026 02:05:31 GMT+0530 (India Standard Time)
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్ లో కైకాల సత్యనారాయణ మరణాన్ని జీర్ణించుకోలేక పోతుండగా.. ఇప్పుడు మరో విషాదం వెంటాడింది. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు.
Next Story

