Thu Mar 19 2026 04:41:03 GMT+0530 (India Standard Time)
సీనియర్ నటులు చంద్రమోహన్ కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు

టాలీవుడ్ సీనియర్ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.
ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Next Story

