Thu Mar 19 2026 10:57:14 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో విషాదం

కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి (62) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. 1987వ సంవత్సరంలో కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివ ప్రసాద్ రెడ్డి.. శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.

Next Story

