Mon Mar 16 2026 06:00:12 GMT+0530 (India Standard Time)
ఇండస్ట్రీలో మరో విషాదం
టాలీవుడ్ ను వరస మరణాలు విషాదంలో ముంచెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సాగర్ మరణించారు.

టాలీవుడ్ ను వరస మరణాలు విషాదంలో ముంచెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సాగర్ మరణించారు. ఆయన చెన్నైలోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాగర్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సాగర్ తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.
అనేక చిత్రాలకు...
సాగర్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మదొంగ, జగదేక వీరుడు సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. చారుశీల సినిమాకు నిర్మాతగా కూడా సాగర్ వ్యవహరించారు. వి.వి. నాయక్, శ్రీను లాంటి డైరెక్టర్లు సాగర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఆయన మరణం పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- sagar
- passed away
Next Story

