Tue Feb 03 2026 22:16:16 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుడు మారుతి కుటుంబంలో తీవ్ర విషాదం
ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి వన కుంచెలరావు (76) మచిలీపట్నంలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా..

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి వన కుంచెలరావు (76) మచిలీపట్నంలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మారుతి తండ్రి మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర, వైసీపీ యువ నాయకుడు పేర్ని కిట్టుతో పాటు మచిలీపట్నంకు చెందిన పలువురు ప్రముఖులు మారుతి ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. మారుతి ప్రస్తుతం గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా ఓ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది.
Next Story

