Thu Mar 19 2026 16:08:56 GMT+0530 (India Standard Time)
తిత్లీ తుఫాను బాధితులకు జీవిత - రాజశేఖర్ సాయం

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది. తమ వంతుగా సినీ పరిశ్రమ బాధితులకు ఆపన్న హస్తాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత తుపాను బాధితులకు రూ.10 లక్షలు విరాలాన్ని అందించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అమరావతిలోని ఆయన స్వగృహంలో నేరుగా కలుసుకుని రూ.10 లక్షల చెక్‌ను ఆయనకు అందించారు.
Next Story

