Thu Jan 29 2026 18:13:37 GMT+0000 (Coordinated Universal Time)
హాట్ కేకుల్లా ‘ హరిహర వీరమల్లు’ టికెట్స్
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈనెల 24వ తేదీన హరిహరవీరమల్లు మూవీ విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ముందుగానే టిక్కెట్ బుక్స్ చేసుకుని తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని తహతహలాడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత...
ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి విడుదలయ్యే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే టిక్కెట్లు ఓపెన్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ వేదికల ద్వారా బుకింగ్స్ మొదలవగా ప్రీమియం సీట్లు కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. దీంతో భారీ ఓపెనింగ్స్ తో ఈ చిత్రం విడుదలకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది
Next Story

