Fri Dec 06 2024 04:18:26 GMT+0000 (Coordinated Universal Time)
Highest Paid Indian Actor: సినిమాకు 275 కోట్లు తీసుకునే హీరో ఎవరో తెలుసా?
తమిళనాడులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే గోట్ సినిమాతో
ఇళయ దళపతి విజయ్ తమిళనాడులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే గోట్ సినిమాతో తమిళనాడు బాక్సాఫీసును షేక్ చేశాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్క సినిమా మాత్రమే చేయబోతున్నాడు దళపతి విజయ్. అతని కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ కు 'దళపతి 69' అనే పేరు పెట్టాడు. జై భీమ్ సినిమా దర్శకుడు H వినోద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 2025న థియేటర్లలో విడుదల కానుంది.
ఫిల్మీబీట్ నివేదించిన ప్రకారం విజయ్ అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించాడు. అతని కొత్త చిత్రం తలపతి 69 కోసం ఏకంగా రూ. 275 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళకముందు చివరి ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రం ప్రత్యేక ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. భారతదేశంలో షారుఖ్ ఖాన్ ఓ ప్రాజెక్ట్ కోసం రూ. 250 కోట్లు తీసుకున్నారని, ఆయనే రెమ్యునరేషన్ లో టాప్ అని చెబుతున్నారు.. ఇప్పుడు షారుఖ్ ఖాన్ రికార్డును అధిగమించాడు విజయ్. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచాడు. విజయ్ రాజకీయ జీవితం మొదలు కావడంతో దళపతి 69లో రాజకీయాలే కాకుండా అభిమానులకు కావాల్సిన అన్ని ఎలెమెంట్స్ ఉంటాయని అంటున్నారు.
Next Story