Fri Jan 30 2026 07:50:04 GMT+0000 (Coordinated Universal Time)
అన్నపూర్ణ స్టూడియోలో... పవన్, బాలకృష్ణ
అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందడి నెలకొంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో షూటింగ్ కు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు

అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందడి నెలకొంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో షూటింగ్ కు ఈరోజు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఆహా ఓటీటీలో ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోెస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
అభిమానుల సందడి...
అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ షో షూటింగ్ కు ఈరోజు హాజరవుతున్నారని తెలిసి ఇరువురు అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. ఫ్యాన్స్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోతుంది.
Next Story

