Fri Dec 05 2025 10:52:29 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణం కుటుంబ గొడవలా ?
మధ్యాహ్నం బులెటిన్ లో.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమన్నారు. కాగా..

ఆకాశంలో ఒక తార నేలరాలింది. సూపర్ స్టార్ కృష్ణ(79) ఇకలేరు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ తో తుదిశ్వాస విడిచినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో కృష్ణగారిని కుటుంబసభ్యులు తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని.. పావుగంట పాటు సీపీఆర్ చేసి.. ఆపై వెంటలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నిన్న వైద్యులు తెలిపారు.
మధ్యాహ్నం బులెటిన్ లో.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమన్నారు. కాగా.. కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి విషమించడానికి కారణం ఆయన కుటుంబంలో జరుగుతున్న గొడవలేనని ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. ఘట్టమనేని కుటుంబ సభ్యుల మధ్య వారంరోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. వాటి కారణంగానే ఆయన డిప్రెషన్ లోకి వెళ్లడంతో.. హార్ట్ ఎటాక్ వచ్చిందని సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరలవుతోంది. ఇది తెలిసిన నెటిజన్లు ఆయన అసలే కొడుకు, భార్య చనిపోయిన బాధలో ఉంటే.. ఇలాంటి గొడవలేంటి అనుకుంటున్నారు. ఏదేమైనా పెద్దవాళ్లింట్లో ఏం జరిగినా బయటికి పొక్కనివ్వరు కదా. సూపర్ స్టార్ ఇక మనమధ్య లేరన్నది వాస్తవం. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.
Next Story

