Fri Dec 05 2025 17:49:49 GMT+0000 (Coordinated Universal Time)
Thangalaan ఓటీటీలో విడుదలకు సిద్ధమైన తంగలాన్
ఇప్పుడు ఈ సినిమా OTT లో విడుదల

పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ కూడా సాధించింది. మొదటి వారాంతంలో చాలా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా OTT లో విడుదల కాబోతోంది. తంగలాన్ సెప్టెంబర్ 20 నుండి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ప్రసారం కానుంది.
నెట్ఫ్లిక్స్ అధికారికంగా తంగలాన్ OTT హక్కులను తీసుకుంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్పై K. E. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బంగారం కోసం చేసే అన్వేషణ ఈ సినిమాలో చక్కగా చూపించారు. మరోసారి చియాన్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో ఇంకా మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ 'గోట్' సినిమాకు ఆదరణ ఎక్కువగా ఉండడంతో తంగలాన్ కు కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఇక మిగిలిన భాషల్లో థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది.
Next Story

