Fri Dec 05 2025 17:50:42 GMT+0000 (Coordinated Universal Time)
థమన్ ను తమన్నా.. సముద్రఖనిని సముద్రాల చేశారు
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బంధువైన మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని

హైదరాబాద్ శిల్పకళా వేదికగా బ్రో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, ఊర్వశి రాతెలా ఈవెంట్లో పాల్గొన్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బ్రహ్మానందం ప్రత్యేక అతిథులుగా సందడి చేశారు. ఈ ఈవెంట్ లో ప్రముఖ పొలిటీషియన్ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక పొలిటీషియన్స్ కు సినిమా వాళ్ల పేర్లు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఆ సమయంలో ఆయన ఆ చిత్రానికి పని చేసిన వారిని అభినందించాలని అనుకున్నారు. ఆ సమయంలో ఫోన్ తీసి.. సినిమాలో పని చేసిన వాళ్ల పేర్లను చదివారు. ఆ సమయంలోనే ఆయన కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బంధువైన మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తమన్నా అన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ని ధర్మ తేజ అన్నారు. ఇక కేతిక శర్మ అనబోయి కీర్తి శర్మ అన్నారు. దర్శకుడు సముద్రఖని పేరు సముద్రాల అన్నారు. దీంతో ఆయన స్పీచ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఆయన ఒక పొలిటికల్ లీడర్ కదా సినిమాల గురించి పాపం పెద్దగా తెలిసినట్లు కూడా లేదని ఇంకొందరు అంటున్నారు.
జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుక సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు 8:30 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాస్త లేటుగా పవన్ కళ్యాణ్ వచ్చినా.. అభిమానుల కోసం చాలా సేపే మాట్లాడారు.
Next Story

