పొలిటికల్ లీడర్ కూతురితో ప్రదీప్ పెళ్లి?
యాంకర్ గా అటు స్టేజ్ పైన ఇటు వివాదాల పరంగా ప్రదీప్ ఎప్పటికప్పుడు న్యూస్ లో ఉంటూ ఉంటాడు. మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు స్టేజ్ [more]
యాంకర్ గా అటు స్టేజ్ పైన ఇటు వివాదాల పరంగా ప్రదీప్ ఎప్పటికప్పుడు న్యూస్ లో ఉంటూ ఉంటాడు. మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు స్టేజ్ [more]
యాంకర్ గా అటు స్టేజ్ పైన ఇటు వివాదాల పరంగా ప్రదీప్ ఎప్పటికప్పుడు న్యూస్ లో ఉంటూ ఉంటాడు. మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు స్టేజ్ మీద కామెడీ చెయ్యడం, ఢీ షో లో, జీ తెలుగు షోస్ లో ప్రదీప్ యాంకరింగ్ కి విశేషమైన అభిమానులున్నారు. ఇక హీరో గా ఓ సినిమా కూడా చేసాడు. థియేటర్స్ బంద్ కారణంగా ఆ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. అయితే ఎప్పటినుండో ప్రదీప్ పెళ్లి ముచ్చట పై ప్రచారం జరిగినా ప్రదీప్ మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు. అయితే అందరూ ప్రదీప్ ని పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతూనే ఉంటారు.మరి ఏదైనా ఎఫ్ఫైర్ ఉండి బ్రేకప్ అయ్యిందో.. తెలియదు కానీ.. ప్రదీప్ మాత్రం పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోతుంటాడు.
అయితే తాజాగా ప్రదీప్ మాచిరాజు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. త్వరలోనే ప్రదీప్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని.. ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాయలసీమకు చెందిన ఒక పొలిటీషియన్ కుమార్తె అని సమాచారం. మరి ఇది నిజమా కాదా అనేది ప్రదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రదీప్ క్రేజ్ తో ఆ పొలిటికల్ లీడర్ తన కూతుర్ని ప్రదీప్ కి ఇవ్వడానికి రెడీ అయ్యాడని అంటున్నారు