Fri Dec 05 2025 17:10:59 GMT+0000 (Coordinated Universal Time)
Mirai : మిరాయ్.. మాయ... టాలీవుడ్ లో మరో సంచలనం.. ఆలోచనలో పెద్ద నిర్మాతలు
తెలుగు మూవీ మిరాయ్ సంచలనాలను సృష్టిస్తుంది. భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది.

తెలుగు మూవీ మిరాయ్ సంచలనాలను సృష్టిస్తుంది. భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. విడుదలయిన రోజు నుంచి పాజిటివ్ తెచ్చుకున్న మిరాయ్ మూవీ ఇప్పటికే వంద కోట్లకు చేరువయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఆరెంజ్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయని అంటున్నారు. యంగ్ హీరో తేజ సజ్జ, రితిక్ నాయక్ ఈ మూవీలో జంటగా నటించారు. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ ఈ మూవీలో నటించడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. దీంతో బాక్సాఫీసుల వద్ద సంచలనాలకు వేదికగా మిరాయ్ మూవీ మారనుంది.
అన్ని విషయాల్లోనూ...
మిరాయ్ మూవీ గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిది. ఆంధ్ర, సీడెడ్, నైజాంలతో పాటు హిందీ మార్కెట్ తో పాటు యూఎస్ లో కూడా విజయవంతంగా మూవీ కొనసాగుతుంది. మిరాయ్ మూవీ తొి రోజు 27.2 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. రెండో రోజుకు 28. 4 కోట్లు, మూడో రోజుకు 81.2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. వీఎఫెక్స్ ప్రేక్షకులను అలరించడంతో పాటు, కథ, డైరెక్షన్, సంగీతం వంటి విషయాల్లో ఆడియన్స్ మిరాయ్ ను మెచ్చుకుంటుండటం అదనపు బలంగా మారిందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాతలు తమ ఆలోచనను...
మరొక వైపు ఈ వారం చివరకు వంద కోట్ల మార్క్ దాటే అవకాశముందని కూడా చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రం ఇప్పటి వరకూ అమెరికాలో 1.8 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. త్వరలోనే ఇది రెండు మిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆశిస్తున్నారు. కంటెంట్ బలంగా ఉంటే చిత్రంలో ఉన్న నటీనటులతో సంబంధం లేకుండా మిరాయ్ సాధించిన విజయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేవలం అరవై కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి ప్రాఫిట్స్ ను నిర్మాతకు తెచ్చిపెట్టేందుకు అవకాశాలున్నాయి. దీంతో ఇక చిత్ర నిర్మాతలు కూడా చిన్న స్థాయి నటులు.. కొత్త డైరెక్టర్లు, సరికొత్త కథనం వైపు మొగ్గు చూపుతారని టాలీవుడ్ లో అనేకమంది భావిస్తున్నారు.
Next Story

