Thu Mar 19 2026 14:26:09 GMT+0530 (India Standard Time)
TFCC తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షులు ఎవరంటే?
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీ.ఎఫ్.సీ.సీ.) నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ గెలిచారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి డిస్ట్రిబ్యూటర్లు పోటీలో నిలిచారు. భరత్ భూషణ్, ఠాగూర్ మధు (నెల్లూరు) పోటీపడగా, భరత్ భూషణ్ ను విజయం వరించింది.నిర్మాతలు, స్టూడియోల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి.
తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్ష పదవి నిర్మాత అశోక్ కుమార్ కు వరించింది. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది. అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు లభించాయి.
Next Story

