Sun Oct 13 2024 19:57:51 GMT+0000 (Coordinated Universal Time)
Devara : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేవర అదనపు షోలకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేవర అదనపు షోలకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మిడ్ నైట్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. 28వ తేదీ నుంచి వరసగా తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి రోజు ఆరోషోలు వేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతోపాటు టిక్కెట్ల ధరలను పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఇరవై ఐదు రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో యాభై రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దేవర మూవీ ఈ నెల 27వ తేదీన విడుదలవుతుంది.
దేవర రోజుకు ఆరు షోలు
ఈ నెల 27వ తేదీన దేవర సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వరసగా ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మూవీ చూసేందుకు వీలు కలిగిందంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మూవీ మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టంబరు 28 నుంచి అక్టోబరు ఆరోతేదీ వరకూ అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మిడ్ నైట్ షోకు 29 థియేటర్లకు అనుమతి ఇచ్చింది.
Next Story