Sun Mar 15 2026 06:45:04 GMT+0530 (India Standard Time)
Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది

ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకూ అదనపు షోలు వేసుకునేందుకు కూడా థియేటర్ల యాజమాన్యాలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు షోలు...
గరిష్టంగా కల్కి సినిమా టిక్కెట్ ధరను రెండు వందల రూపాయల వరకూ పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణ థియేటర్లలో డెబ్భయి రూపాయలు వరకూ పెంచుకోవచ్చుక. మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు వరకూ పెంచుకోవచ్చని తెలిపింది. ప్రభాస్ నటించిన సినిమా విడుదల కానుండటంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Next Story

