Thu Mar 19 2026 22:32:51 GMT+0530 (India Standard Time)
తారకరత్న పెద్దకూతురు ఎమోషనల్ లెటర్..
తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. భావోద్వేగానికి లోనవుతోంది అలేఖ్య.

టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆకస్మిక మరణం.. అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. ఇటీవలే ఫిలింనగర్ లో ఆయన పెద్దకర్మను నిర్వహించారు. తారకరత్న మరణం మిగిల్చిన విషాదం నుంచి నందమూరి కుటుంబసభ్యులు తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అతని భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నువ్వు లేవన్న నిజాన్ని అంగీకరించలేక నా గుండె బద్దలవుతోందంటూ.. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. భావోద్వేగానికి లోనవుతోంది అలేఖ్య. ఈ నేపథ్యంలో తారకరత్న-అలేఖ్యల పెద్దకూతురు నిష్క.. తన తల్లి ఏడుపు ఆపాలని కోరుతూ ఓ లేఖ రాసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్ల మనసులను కదిలించింది. అమ్మా.. నీ మనసు చాలా విరిగిపోయినట్లు కనిపిస్తోంది. నువ్వు మరోసారి ఏడ్చినట్లు కనిపిస్తే.. నేను గుడ్ బై చెప్పేస్తాను అని నిష్క ఆ లేఖలో రాసింది. ఇది చూసిన నెటిజన్లు.. అలేఖ్యకు ధైర్యం చెబుతున్నారు. నందమూరి కుటుంబం మీకు అండగా ఉంటుందని, పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story

