తాప్సి కూడా యూటర్న్ తీసుకుంది
తెలుగులో ఎంతో ఇష్టపడి కన్నడ రీమేక్ యూటర్న్ చేసింది సమంత అక్కినేని. సమంత హాట్ నటన, ఆమె అభినయానికి బోలెడన్ని మార్కులు పడడమే కాదు.. సినిమాకి సూపర్ [more]
తెలుగులో ఎంతో ఇష్టపడి కన్నడ రీమేక్ యూటర్న్ చేసింది సమంత అక్కినేని. సమంత హాట్ నటన, ఆమె అభినయానికి బోలెడన్ని మార్కులు పడడమే కాదు.. సినిమాకి సూపర్ [more]

తెలుగులో ఎంతో ఇష్టపడి కన్నడ రీమేక్ యూటర్న్ చేసింది సమంత అక్కినేని. సమంత హాట్ నటన, ఆమె అభినయానికి బోలెడన్ని మార్కులు పడడమే కాదు.. సినిమాకి సూపర్ హిట్ టాక్ కూడా పడింది. కానీ కలెక్షన్స్ రాలేదు. అయితే తెలుగు తమిళ భాషల్లో హిట్ అయిన యూటర్న్ సినిమాని ఇప్పుడు ఒరిజినల్ దర్శకనిర్మాతలు బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అయితే తెలుగులో సూపర్బ్ గా నటించిన సమంతనే బాలీవుడ్ యూటర్న్ రీమేక్ లో నటించమని అడగ్గా… సౌత్ నుండి వెళ్లడం ఇష్ట లేకో.. లేదంటే హిట్ అనుకున్న సినిమాకి కలెక్షన్స్ రాలేదు, బాలీవుడ్ లో మాత్రం వర్కౌట్ అవుతుంది అంటే నమ్మకం లేకో.. కానీ సమంత ఆ బాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించింది.
అయితే సమంత యూటర్న్ బాలీవుడ్ రీమేక్ కాదనగానే…. సమంత ప్లేస్ లోకి తాప్సి పేరు వచ్చింది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సి బాలీవుడ్ రీమేక్ యూటర్న్ లో నటించబోతుంది అని ప్రచారం జరిగింది. ఇక తాప్సి అని అందరూ ఫిక్స్ కూడా అయ్యారు. కానీ తాజాగా తాప్సి యూటర్న్ రీమేక్ లో నటించడం లేదని.. నేను ఆ రీమేక్ చేస్తున్న అని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వయానా తాప్సినే కొట్టేపారేసింది. ప్రస్తుతం ఓ సౌత్ సినిమాతో పాటుగా ఐదారు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా వున్నట్లుగా తెలిపింది. మరి ఇప్పుడు బాలీవుడ్ యూటర్న్ రీమేక్ కోసం ఏ హీరోయిన్ ని తీసుకుంటారో చూడాలి

