Wed Dec 17 2025 08:45:16 GMT+0000 (Coordinated Universal Time)
రేపటికి వాయిదా పడిన 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు, అల్లు అర్జున్ ముఖ్య అతిథి.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన,చందూ మొండేటి దర్శకత్వంలో , మెగా ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్ సమర్పణలో ,గీతా ఆర్ట్స్ బానర్ పై, ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా తండేల్.
ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగాల్సి ఉంది.
కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.ఇవాళ సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని సినిమా యూనిట్ ప్రకటించారు.
”ఈసారి అసలు గురి తప్పేదే లేదు లేదు" అంటూ...ఒక పోస్టర్ ని విడుదల చేశారు.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 7 వ తారీఖున వెండితెరపై ప్రదర్శించేందుకు సిద్దమవుతోంది..!
Next Story

