Thu Dec 05 2024 16:11:49 GMT+0000 (Coordinated Universal Time)
Vishal : ఎవరో అమ్మాయితో ఫారిన్లో విశాల్.. మొహం దాచుకుంటున్న వీడియో వైరల్..
ఫారిన్లో ఎవరో అమ్మాయితో విశాల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఆ వీడియోలో విశాల్ మొహం దాచుకుంటూ..
Vishal : తెలుగులో ప్రభాస్ పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లే, తమిళంలో అందరూ విశాల్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఆ మాట తియ్యకుండా వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ పై దృష్టి పెట్టారు. అయితే తాజాగా విశాల్ ఒక అమ్మాయితో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో విశాల్ మొఖం దాచుకుంటూ, కెమెరా నుంచి దూరంగా పరిగెడుతూ కనిపించారు.
విశాల్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తన తదుపరి మూవీ కోసమే వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ సాయంకాల వేళ విశాల్ ఎవరో అమ్మాయితో కలిసి న్యూయార్క్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇక అక్కడ విశాల్ ని గుర్తుపట్టిన కొందరు ఆయనను వీడియో తీయగా.. విశాల్ మొఖం దాచుకుంటూ, కెమెరా నుంచి దూరంగా పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్నది నిజంగా విశాలేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం.. ఇది ప్రమోషన్స్ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇది సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వీడియో నిజంగా సినిమా ప్రమోషనేనా..? లేక నిజంగా విశాల్ రిలేషన్ లో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హరి దర్శకత్వంలో రత్నం అనే మూవీ చేస్తున్నారు. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పొగరు, పూజ సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు రత్నంతో మరోసారి హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతో పాటు తన సూపర్ హిట్ మూవీ 'డిటెక్టీవ్'కి సీక్వెల్ ని కూడా సిద్ధం చేస్తున్నారు విశాల్. ఈ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేస్తున్నారు.
Next Story