Mon Oct 14 2024 06:36:43 GMT+0000 (Coordinated Universal Time)
Divorce: మరో బంధానికి బీటలు.. స్టార్ హీరో విడాకుల ప్రకటన
తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జయం రవితో ఉన్న ఫోటోలను డిలీట్
తమిళ నటుడు జయం రవి సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆర్తితో విడిపోతున్నానని ప్రకటించారు. ఎంతో ఆలోచించి, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తూ తమిళం, ఆంగ్లంలో ఒక ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాలో జయం రవి పంచుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు గోప్యత అవసరమని కూడా కోరారు. కొన్ని నెలల క్రితం, ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జయం రవితో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వారు విడిపోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
ఎన్నో చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నానని, ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదని జయం రవి తన పోస్టులో వివరించారు. నా ప్రాధాన్యత ఎప్పుడూ అలాగే ఉంటుందని, నా చిత్రాల ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని, వినోదాన్ని అందించడం కొనసాగిస్తానని హామీ ఇచ్చాడు. నేను ఇప్పటికీ, ఎల్లప్పుడూ మీ జయం రవిగా ఉంటాను.
జయం రవి, ఆర్తిల వివాహం జూన్ 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆర్తి -జయం రవి విడాకుల గురించి కథనాలు తమిళ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు విడిపోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.
జయం రవి, ఆర్తిల వివాహం జూన్ 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆర్తి -జయం రవి విడాకుల గురించి కథనాలు తమిళ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు విడిపోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.
Next Story