Thu Mar 19 2026 04:42:52 GMT+0530 (India Standard Time)
ప్రముఖ నటుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ RS శివాజీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఈరోజు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి వెతికే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో ఆయన కనిపించారు. ఇక పలు తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ అవ్వడంతో తెలుగు సినీ అభిమానులకు కూడా పరిచయమైన నటుడే..!
కమల్ హాసన్ కు శివాజీ మంచి స్నేహితుడు. కమల్ తో కలిసి విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివం లాంటి సినిమాల్లో కనిపించారు. శివాజీ తండ్రి ఎంఆర్ సంతానం నిర్మాత. శివాజీ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. శివాజీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

