మహేష్ కి తప్పలేదుగా
ఎప్పుడూ డాన్స్ లు చెయ్యకుండా కాస్త అటు ఇటు స్టైలిష్ గా నడుస్తూ… ఏదో చిన్న చిన్న స్టెప్స్ తో మ్యానేజ్ చేసే మహేష్ బాబు ని [more]
ఎప్పుడూ డాన్స్ లు చెయ్యకుండా కాస్త అటు ఇటు స్టైలిష్ గా నడుస్తూ… ఏదో చిన్న చిన్న స్టెప్స్ తో మ్యానేజ్ చేసే మహేష్ బాబు ని [more]

ఎప్పుడూ డాన్స్ లు చెయ్యకుండా కాస్త అటు ఇటు స్టైలిష్ గా నడుస్తూ… ఏదో చిన్న చిన్న స్టెప్స్ తో మ్యానేజ్ చేసే మహేష్ బాబు ని ఇప్పుడు తమన్నా మాత్రం డాన్స్ చెయ్యకుండా వదల్లేదు. తనతో పాటె..మహేష్ తోనూ స్టెప్స్ వేయించింది. సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి మాస్ బీట్ వీడియో సాంగ్ ప్రోమో ని వదిలారు. మహేష్ బాబు అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తమన్నా సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మొదటి నుండి తమన్నా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మాస్ అండ్ ఐటెం సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేసిందట అని వస్తున్నా ప్రచారం అక్షరాలా నిజం. సరిలేరు లో డ్యాంగ్ డ్యాంగ్ అంటూ తమన్నా ఊపిన ఊపుడు మాత్రం అబ్బో అదిరింది తమ్ము అంటారు.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి సరిపడా మాస్ అనలేము కానీ… మాస్ క్లాస్ కలిసిన స్టెప్స్ తో తమన్నా మాత్రం డాన్స్ ఇరగదీసింది. తమన్నానే కాదు. మహేష్ కి కూడా ఈసారి తప్పలేదు. తమన్నా తో కలిసి మంచి డాన్స్ మూమెంట్ ఇచ్చాడు మహేష్ బాబు . సరిలేరు లో ఇంతవరకు విడుదలైన ఒక్క పాటల్లోనూ మహేష్ స్టెప్స్ చూసింది లేదు.. ఇప్పుడు తమన్నా తో కలిసి మహేష్ డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ లో డాన్స్ చేసాడు. ఈ సాంగ్ మొత్తం మిలటరీ నేపథ్యంలో సాగుతుంది. కాస్త పార్టీ మూడ్లో ఉన్న సైనికుల మధ్య సాగే పాట ఇది. మరి తమన్నా జై లవకుశ లో స్వింగ్ జరా తో ఎన్టీఆర్ అభిమానులను ఓ ఊపు ఊపినట్టుగా.. ఇప్పుడు డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ తో మహేష్ అభిమానులను ఓ ఊపు ఊపడం ఖాయం.

