Fri Dec 05 2025 19:15:42 GMT+0000 (Coordinated Universal Time)
Tamannah Bhatia: కర్ణాటకకు చెందిన నటి కాదు.. సోప్ కోసం తమన్నా వద్దు!!
మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియా

కర్ణాటక సోప్స్ & డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను నియమించినట్లు భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి M.B. పాటిల్ ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ఈ చర్యల లక్ష్యం అని చెప్పారు.
మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను నియమించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆన్లైన్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. రెండేళ్లకు రూ.6.20 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, సొంత రాష్ట్రానికి చెందిన వారికి బదులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కన్నడ నటి కాని వారిని ఎందుకు ఎంచుకున్నారని ఒక వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే మంత్రి ఎంబీ పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు, దీనిని కర్ణాటకను దాటి ఇతర రాష్ట్రాల మార్కెట్లను చేరుకోవడానికి ఒక మార్గం అని చెప్పారు.
మైసూర్ శాండల్ సబ్బు 1916 నుండి తయారు చేస్తున్నారు. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన సోప్ లలో ఒకటి. మైసూర్ రాజు కృష్ణ రాజ వడియార్ IV 1900ల ప్రారంభంలో బెంగళూరులో ప్రభుత్వ సబ్బు కర్మాగారాన్ని స్థాపించారు. అందువల్ల, ఈ బ్రాండ్ కర్ణాటకలో సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తమన్నా బ్రాండ్ డీల్‌ను పొందగా.. ఇప్పుడు వివాదంగా మారింది.
Next Story

