Thu Dec 05 2024 15:53:04 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ షారుఖ్ హీరోయిన్
షారుఖ్ ఖాన్ 'స్వదేస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన గాయత్రి జోషి
షారుఖ్ ఖాన్ 'స్వదేస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ఇటీవల ఇటలీలో జరిగిన కారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. వారు సెలవుపై వెళ్లిన సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయత్రి, ఆమె భర్త తమ లంబోర్ఘిని నడుపుతుండగా వారి లగ్జరీ కారు ఫెరారీ, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. ఫెరారీ కారులో ఉన్న వారు చనిపోయారు.
వెకేషన్ లో భాగంగా ఓల్బియా నుండి టెయులాడా వెళ్తుండగా వీరి కారుని మరో ఫెరారీ కారు ఢీ కొట్టింది. ఆ తర్వాత ముందు వెళుతున్న క్యాంపర్ వ్యాన్ బోల్తా పడగా, ఫెరారీ కారులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. గాయత్రి, వికాస్లకు స్వల్ప గాయాలై క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. "వికాస్, నేను ఇటలీలో ఉన్నాము. మేము ప్రమాదానికి గురయ్యాము. దేవుడి దయతో, మేమిద్దరం పూర్తిగా క్షేమంగా ఉన్నాము" అని గ్రాయత్రి తెలిపారు.
నివేదికల ప్రకారం, రెండు లగ్జరీ వాహనాలు తమ ముందున్న భారీ క్యాంపర్వాన్ను అధిగమించేందుకు ప్రయత్నించే క్రమంలో అవి ఢీకొని పెను ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ కూడా రోడ్డుపై బోల్తా పడింది. ఇంతలో ఫెరారీలో మంటలు చెలరేగాయి. గాయత్రి జోషి 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ని కైవసం చేసుకుంది. అశుతోష్ గోవారికర్ స్వదేశ్ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
Next Story