Fri Dec 05 2025 23:24:06 GMT+0000 (Coordinated Universal Time)
Rajini Kanth : రజనీ నువ్వు విజిల్ వేస్తే ...ఐదు వందల కోట్ల కు దగ్గరగా
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తుంది. గత వారం విడుదలైన కూలీ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టింది.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా కూలీ మూడు వందల క్లబ్ లోకి చేరుకుంది. ఈ మూవీపై మిక్స్ డ్ టాక్ వినిపించినప్పటికీ డబ్బులు రాబట్టే విషయంలో మాత్రం రజనీకాంత్ తన రికార్డులను తానే అధిగమించేలా చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన కూలీ మూవీలో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున ప్రతి నాయకుడి పాత్రను పోషించారు.
తొలి రోజు నుంచే...
రజనీకాంత్ ఇప్పటికీ అదే స్టయిల్.. అదే మ్యానరిజంతో ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాలో రూపొందించిన ఈ మూవీకి తొలి నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ ల నుంచే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు దిశగా పయనిస్తుంది. వరస సెలవులు కూడా రావడంతో రజనీ మూవీ వసూళ్లు ఇంకా కొనసాగుతాయంటున్నారు. కూలీ మూవీ మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల మార్క్ ను దాటేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కొత్తేమీ కాకపోయినా...
అయితే ఈ మార్క్ దాటడం రజనీకాంత్ కు కొత్త కాదు. గతంలో విడుదలయిన రోబో, కబాలి సినిమాలు మూడు వందల క్లబ్ లో చేరాయి. ఇప్పుడు తాజాగా కూలీ కూడా చేరింది. ఈ మూవీ ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్ కు చేరుకునేందుకు ఎంతో దూరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ మొదటి వారంలోనే మూవీ 444 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరితే మాత్రం రజనీ రికార్డు బ్రేక్ చేసినట్లే అవుతుంది.
Next Story

