Sun Oct 13 2024 20:04:39 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ స్టార్ రజనీకాంత్కు అస్వస్థత
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన అర్ధరాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రజనీకాంత్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు కూడా ప్రత్యేకంగా పరీక్షలు జరిపారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్యం నిలకడగానే...
అయితే రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఆయన కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారని, ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. రజనీకాంత్ హెల్త్ బులిటెన్ కూడా మరికాసేపట్లో విడుదల కానుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు జరుపుతున్నారు.
Next Story