Thu Mar 05 2026 05:17:30 GMT+0530 (India Standard Time)
సూపర్ స్టార మహేష్ బాబు తల్లి మృతి
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. ఈరోజు తెల్లవారుజామున ఆమె మృతి చెందారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. ఈరోజు తెల్లవారుజామున ఆమె మృతి చెందారు. గత కొంతకాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇందిరాదేవి నివాసంలోనే కన్ను మూశారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య. ఆమెకు రమేష్ బాబు, మహేభ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని జన్మించారు.
ఐదుగురు సంతానం...
కృష్ణ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. విజయనిర్మల మృతితో కృష్ణ కొంత డల్ అయ్యారు. ఇప్పుడు ఇందిరాదేవి కూడా మరణించడంతో ఆయన మరింత విషాదంలోకి మునిగిపోయారు. తన పెద్దకుమారుడు రమేష్ బాబు మృతితో కృష్ణ మరింత డీలా పడిపోయారు. ఇందిరా దేవి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

