Sun Mar 15 2026 05:06:50 GMT+0530 (India Standard Time)
మహేష్ బాబు మోకాలికి సర్జరీ
సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ అయింది. స్పెయిన్ లో ఆయన సర్జరీ చేయించుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ అయింది. స్పెయిన్ లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ బాబు గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. షూటింగ్ లలో కూడా ఈ బాధ ఎక్కువగా ఉండటంతో ఆయన సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. స్పెయిన్ కు వెళ్లి తన మోకాలి సర్జరీ చేయించుకున్నారు.
దుబాయ్ లో విశ్రాంతి.....
స్పెయిన్ నుంచి దుబాయ్ కు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా జరగాల్సి ఉంది. వైద్యులు కొంతకాలం విశ్రాంతి అవసరమని సూచించడంతో ఆయన దుబాయ్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
Next Story

