Fri Dec 05 2025 17:33:59 GMT+0000 (Coordinated Universal Time)
నాన్న కోసం వచ్చారా.. అంటూ..?
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి కృష్ణ అంత్యక్రియల కోసం వచ్చిన అభిమానులను ఆయన ఆదరించారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి కృష్ణ అంత్యక్రియల కోసం వచ్చిన అభిమానులను ఆయన ఆదరించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కృష్ణను చివరిసారి చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. శ్రీకాకుళం, చిత్తూరు ఇటు ఆదిలాబాద్, అనంతపురం నుంచి కూడా అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఉదయాన్నే పద్మాలయా స్టూడియోకు చేరుకున్న కృష్ణ అభిమానులు మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఆయనను చూసేందుకు క్యూలైన్ లో వేచి ఉన్నారు.
అభిమానుల కోసం...
దీంతో మహేష్ బాబు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. నాన్నను కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు ఖాళీ కడుపుతో వెనక్కు వెళ్ల కూడదని, ఆకలి బాధను అనుభవించకూడదని భావించి మహేష్ బాబు వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కల్పించారు. దీంతో అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు అంటూ మహేష్ బాబుపైన ప్రశంసలు కురిపించారు.
- Tags
- mahesh babu
- fans
Next Story

