Thu Mar 19 2026 11:00:15 GMT+0530 (India Standard Time)
నేడు కృష్ణ సంస్మరణ సభ
సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ నేడు జరగనుంది. ఈ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది.

సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ నేడు జరగనుంది. ఈ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. కృష్ణ మరణించిన పన్నెండు రోజులు కావస్తుంది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో పాటు కృష్ణ అభిమానులు ఐదు వేల మంది హాజరు కానున్నారు. కృష్ణ పెద్ద కర్మను ఈరోజు ఘట్టమనేని కుటుంబం నిర్వహిస్తుంది.
టాలీవుడ్ ప్రముఖులతో పాటు...
సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ దినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఎంత మంది వచ్చినా వారికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మరణించిన రోజున భౌతిక కాయాన్ని సందర్శించుకోలేని టాలీవుడ్ లోని కొందరు ముఖ్యలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Next Story

